‘టీఆర్‌ఎస్’పై అభ్యంతరాలుంటే చెప్పాలి
22-05-2026 12:27 AM
- జూన్ 1లోగా తెలియజేయండి
- నోటీసు జారీ చేసిన ఈసీ
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : ఇటీవల తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరిట ప్రకటించిన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ప్రాంతీయ పార్టీకి అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత, జనరల్ సెక్రటరీగా దేవనపల్లి అనిల్ కుమార్ ఉన్నారు. ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ రిజిస్ట్రేషన్‌పై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే వాటిని జూన్ 1 లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈసీ తుదినిర్ణయం తీసుకోనుంది.






