అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలి
29-03-2025
అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట సిపి అనురాధ అన్నారు. శనివారం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ లను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలను నాటారు.