మత సామరస్యానికి ప్రతీక రంజాన్
29-03-2025
హనుమకొండ, మార్చి 28 (విజయ క్రాంతి): మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది.పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మతసామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజిపేట లోని జామా మస్జిద్, పారడైజ్ ఫంక్షన్ హాల్ లో కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనతరం ముస్లిం సోదరులకు అడ్వాన్సు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుసృ పాషా, మీర్జా అజీజుల్లా బేగ్, సయ్యద్ రజాలి, సుంచు అశోక్, అబు బాకర్, మొహమ్మద్ యూనస్, తహశీల్దార్ బావు సింగ్ పాల్గొన్నారు.