మోకిలా పీఎస్‌కు జీవన్‌రెడ్డి
29-03-2025
చేవెళ్ల, మార్చి 28: భూకబ్జా కేసు విషయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామా బాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. శంకర్పల్లి మండలం టంగుటూరు, చేవెళ్ల మండలం ఈర్లపల్లిలో భూవివాదానికి సంబంధించి జీ వన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మోకిలా, చేవెళ్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగియగా జడ్జి తీర్పు రిజర్వ్ చేశారు. జీవన్‌రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, పోలీసుల విచారణ ఆపాలని అప్పీల్ చేసుకున్నారు. దీన్ని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన సర్వోన్నత న్యాయ స్థానం అతన్ని అ రెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం మోకిలా పీఎస్‌కు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు సుప్రీం ఇచ్చిన ఆర్డర్‌ను వారికి సమర్పించారు.