Districts - Yadadri Bhuvanagiri

ఆండాళ్ అమ్మవారికి ఊoజల్ సేవ
ఆండాళ్ అమ్మవారికి ఊoజల్ సేవ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవంను వైభవంగా నిర్వహించారు.

11-09-2026 | 10:43pm

తుర్కపల్లి ఐటీ పార్క్‌ను త్వరగా అభివృద్ధి చేయాలి
తుర్కపల్లి ఐటీ పార్క్‌ను త్వరగా అభివృద్ధి చేయాలి

ఆలేరు, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తుర్కపల్లి మండలంలో సేకరించిన సుమారు 110 ఎకరాల భూమిలో ఐటీ పార్క్‌ను త్వరగా అభివృద్ధి చేసి ఐటీ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఐటీ పార్క్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలోని కాటేపల్లి, బొమ్మలరామారం మండలం రంగపూర్ తదితర ప్రాంతాల్లోని టైర్ పరిశ్రమల కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

11-09-2026 | 06:55pm

కరెంటు కోతలకు నిరసనగా బిఆర్ఎస్ ధర్నా
కరెంటు కోతలకు నిరసనగా బిఆర్ఎస్ ధర్నా

సంస్థాన్ నారాయణపూర్ ,సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): కరెంటు కోతలకు నిరసనగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ రైతులు, కూలీలు మహాధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకి కనీసం 8 గంటలు కూడా సరఫరా చేయలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యవసాయ పొలాల వద్ద మోటర్లు, పంపులు కాలిపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు సరిపడా విద్యుత్తును వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,రైతులు పాల్గొన్నారు.

11-09-2026 | 01:28pm

రాజ్‌భవన్ ముట్టడి కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కుంభం
రాజ్‌భవన్ ముట్టడి కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కుంభం

ఆలేరు, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌తో కలిసి ఎమ్మెల్యే కోర్టుకు హాజరై విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి వెంట యాదాద్రి డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకునూరి మహేందర్, కాంగ్రెస్ యువ నాయకుడు ఏడునూతల మహేష్ తదితరులు ఉన్నారు.

09-09-2026 | 01:53pm

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు

ఆలేరు, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తుర్కపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో నాయకులు బీఆర్‌ఎస్ తీరును తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

08-09-2026 | 01:05pm