calender_icon.png 30 March, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_88078571.webp
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

29-03-2025

భీమదేవరపల్లి మార్చి 28 (విజయక్రాంతి )హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ కార్యాలయానికి వచ్చిన రౌడీషీటర్లతో ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు .ఎలా ఉన్నారు అని వారి నుండి సమాధానాలు రాబట్టారు. ఎలాంటి క్రిమినల్ కేసులలో తల దూర్చవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలకు దూరంగా ఉండాలని వారిని కోరారు. నూతనంగా వచ్చిన పిడి ఆక్ట్ గురించి వారికి వివరించారు. ప్రమాదకరమైన డగ్స్ ,గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు .సమాజానికి హితం చేసే విధంగా ఉండాలన్నారు. అనంతరం వారి నుండి నూతనంగా దిగిన ఫోటోలను సేకరించారు .ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

article_81698484.webp
ముందస్తుగా ఉగాది వేడుకలు

29-03-2025

కాటారం, మార్చి 28 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి లోని అయ్యప్ప దేవాలయం కాలనీ లో శుక్రవారం ముందస్తు ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అయ్యప్ప వాడలో మహిళలు అందరూ కలిసి ముందస్తుగా ఉగాది పండుగ వేడుకను నిర్వహించుకున్నారు. అందరూ సేకరించిన సామాగ్రిని పడకంటి అంజలి ఇంటి వద్ద నుండి శ్రీ హర్షిత డిగ్రీ కాలేజ్ వరకు తీసుకు వెళ్ళారు. కాలేజీలో షడ్రుచులలో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసారు. మహిళలంతా భక్తి శ్రద్ధలతో పాటలు పాడి పూజలు నిర్వహించి అనంతరం ఉగాది పచ్చడి , భక్ష్యాలను అందరూ స్వీకరించారు. కాలనీలోని పలువురికి ఉగాది పచ్చడిని, భక్ష్యాలను పంచారు. ఒకరికి ఒకరు ఉగాది శుభకాంక్షలు తెలుపుకున్నారు.

article_80527734.webp
నల్ల బ్యాడ్జీలతో నిరసన

29-03-2025

కాటారం, మార్చి 28 (విజయక్రాంతి) : వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి నిరసనగా రంజాన్ చివరి శుక్రవారం అల్విదా జుమా నాడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు చేతికి నల్లటి బ్యాండ్లు, బ్యాడ్జీలు ధరించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్బి) ఇచ్చిన పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం మస్జిద్ కు నల్లటి బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా గారేపల్లి మస్జిద్ అధ్యక్షులు షేక్ అమీర్ మాట్లాడుతూ .. ఈ బిల్లు ముస్లింల మసీదులు, ఈద్గాలు, మదర్సాలు, దర్గాలు, ఖాన్ఖాలు, స్మశానవాటికలు, ధార్మిక సంస్థలను లాక్కునేందుకు ఉద్దేశించిన కపటకుట్రగా పేర్కొన్నారు. ఈ బిల్లుని వ్యతిరేకించడం దేశంలోని ప్రతి ముస్లిం బాధ్యత అని అన్నారు. జుముఅతుల్ విదా ఉన్నందున మసీదుకు వచ్చే సమయంలో ముస్లిం లందరూ నల్లటి బ్యాండ్ ధరించి శాంతియుతంగా , మౌనంగా నిరసన తెలపడం జరిగిందన్నారు. మత పెద్దలు ,ముస్లిం సోదరులు, యువత పాల్గొన్నారు.

article_87084250.webp
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

27-03-2025

కాటారం, మార్చి 26 (విజయక్రాంతి): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికసాయం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని కాటారం తాసిల్దార్ నాగరాజు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ అడ్డురి బాపు, ఎం పి ఓ వీరస్వామి, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు యువతి, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించ డానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి వ్యాపారాల్లో రాణించేందుకు రాయితీని పొందవచ్చుని తెలి పారు

article_57124289.webp
అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై ఉత్కంఠ

27-03-2025

భీమదేవరపల్లి మార్చి 26( విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని హైవే రోడ్డు నిర్మాణం పై ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు కొనసాగుతున్న హైవే నిర్మాణం పనుల్లో భాగంగా ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్టీసీ వారి ఖాళీ స్థలం లోకి మార్చుతారని వదంతులు రావడంతో గత నాలుగు రోజుల నుండి ఆర్టిసి కి చెందిన విజిలెన్స్ పోలీసులు గత నాలుగు రోజులుగా నిద్రాహారాలు లేకుండా విస్తృతంగా పహార నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడున్న స్థలం నుండి తొలగించబోమని తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ పేర్కొంటున్నప్పటికీ హైవే అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆర్టీసీ వారి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తారని ఆ శాఖకు చెందిన అధికారులు పోలీసులు పహార నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మంత్రి సైతం అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడున్న చోటనే ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏది ఏమైనా అంబేద్కర్ విగ్రహం ఇప్పుడున్న చోటనే ఉంటుందా ?లేక మరోచోట ఏర్పాటు చేస్తారా ?అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.