అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
19-01-2025
గజ్వేల్, జనవరి 18: బ్యాంకు ఆవరణలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు. గజ్వేల్ ఎసిపి కార్యాలయంలో శనివారం గజ్వేల్ డివిజన్ పరిధిలోని బ్యాంకుల అధికారులతో బ్యాంకుల భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకుల అంతర్గత భద్రత, ఏటీఎంలో భద్రత, సీసీ కెమెరాల యొక్క పనితీరు గురించి ఏసిపి పురుషోత్తం రెడ్డి బ్యాంకు మేనేజర్లకు సూచనలు చేశారు.