రెడ్డి జాగృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రవీణ్ రెడ్డి
సిరిసిల్ల, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): రెడ్డి జాగృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సోమిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నియామకమయ్యారు. ఆదివారం హైదరాబాదులో జరిగిన రెడ్డి జాగృతి రాష్ట్రస్థాయి సమావేశంలో జిల్లా నియామకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టెంగారి మాధవరెడ్డి, వ్యవస్థాపక సభ్యులు నీరుడి దయాకర్ రెడ్డి, జాతీయ అధ్యక్షులు ఎడ్ల ఉప్పల్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షులు పోరెడ్డి కవిత రెడ్డి తదితరులు ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు రెడ్డి జాగృతి లక్ష్యాలను చేరుకునేలా పట్టుదలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్ సాధనకు శ్రమించాలని సూచించారు. రెడ్డిల్లో నిరుపేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం రాజన్న సిరిసిల్ల నూతన అధ్యక్షుడు సోమిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం పెట్టుకొని జిల్లా అధ్యక్షుడు అవకాశం కల్పించిన జాగృతి రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను కచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
21-09-2026 | 09:26am