ప్రమాదకరమైన ప్రత్యర్థులు
20-11-2024
అభియోక్తలు అంటే ప్రత్యర్థులు. వారు ధర్మవిజయి, లోభవిజయి, అసుర విజయి అని మూడు విధాలుగా ఉంటారని” ఆచార్య చాణక్య చెపుతున్నారు. “ధర్మవిజయి ‘నేను నీ వాడను’ అంటూ లొంగిపోతే పొంగి పోతాడు. ధర్మవిజయిని ఆశ్రయిస్తే ఇతరుల వల్ల కలిగే భయాన్నీ తొలగిస్తాడు. లోభవిజయి భూమిని, సంపదను హరించి సంతోషిస్తాడు. అలాంటి వారికి ధనం ఇచ్చి అనుకూలురుగా చేసుకోవాలి. అసుర విజయి.. భూమిని, సంపదనే కాకుండా భార్యాపిల్లలను కూడా హతమార్చి ఆనందిస్తాడు. అలాంటి వారికి రాజ్యాన్ని, సంపదను అప్పగించి భార్యాపిల్లలతో పారిపోయి సమయం అనుకూలించిన వేళ ప్రతిక్రియను చేయాలి” అంటాడు చాణక్య.