పేదల సేవలో పువ్వాడ కుటుంబం
మానవతా సేవ, దాతృత్వం, సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తూ ఖమ్మం జిల్లాలో పువ్వాడ కుటుంబం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ నిరంతరం సేవా స్ఫూర్తిని కొనసాగిస్తోంది. పువ్వాడ ఫౌండేషన్ను స్థాపించి, పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, మందుల పంపిణీ, గర్భిణులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూ పేదలకు పువ్వాడ కుటుంబం భరోసాగా నిలుస్తోంది.
12-09-2026 | 08:09pm