calender_icon.png 21 November, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_82211131.webp
కేసీఆర్ కలుపు కాదు.. కల్ప వృక్షం

21-11-2024

మహబూబ్‌నగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): కేసీఆర్ కలుపు మొక్క కాదని కల్ప వృక్షమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భయపడేవారే అధిక ప్రసంగం చేస్తారని, కేసీఆర్ నామస్మరణ చేయనదే సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ఉండటం లేదన్నారు. వరంగల్ సభలో సీఎం రేవంత్ 50 సార్లు కేసీఆర్ జపం చేశారన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షతోనే సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారన్నారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీకుంట మండలంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీకుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వరి కల్లాలను హరీశ్‌రావు సందర్శించారు.

article_12821070.webp
పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చిన పోలీసులు

17-11-2024

పరీక్షకేంద్రానికి అభ్యర్థులను సమయనికి చేర్చి వారి పరీక్షను ప్రశాంతమైన వాతావరణంలో రాసేందుకు సహకరించిన పోలీస్ అధికారుల తీరు మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. దీంతో పలువురు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు, మఫ్టీలో ఉన్న ఏఎస్ఐ, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ల ఔదార్యం చాటుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో గ్రూప్-3 పరీక్ష రాసెందుకు వచ్చిన ఓ విద్యార్థిని పరీక్ష సమయానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉండటంతో పరుగులు పెడుతూ కేంద్రం సమీపంలో చేరుకొని, నీరసంతో కేంద్రానికి పది అడుగుల దూరంలో కింద పడబోతుండగా ఆపన్నహస్తంలా మఫ్టీలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ వెంకట్రములు ఆమెను కిందపడకుండా వెంటనే అప్రమత్తమై ఆమెని కింద పడకుండా కాపాడారు.