22 May, 2026 | 1:35 AM

సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఇన్‌చార్జిలు

22-05-2026 12:31 AM
  1. నియోజకవర్గాల వారీగా నియామకం
  2. ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ 119 నియోజక వర్గాలకు ఇన్‌చార్జిలను గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్‌లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటిం చిన మేరకు సభ్యత్వ నమోదుకు డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది.

తెలంగాణ భవన్‌లో శిక్షణ అనంతరం, వీరు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యద ర్శులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యలయాల్లో శిక్ష ణ శిబిరాలు నిర్వహిస్తారు.

ఆయా నియోజకవ ర్గంలోని బూత్‌ల సంఖ్యను బట్టి బూత్‌కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీనుంచి వారం పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణకు హాజరైన వారికి భోజన వసతులు కల్పించనున్నా రు. ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి  ప్రధానకార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల  ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారా లను, జిల్లాల వారీగా నిర్వహించనున్నారు.