22 May, 2026 | 1:37 AM

యువత పాలకులుగా ఎదగాలి

22-05-2026 12:36 AM
  1. సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి మీకే ఉంది
  2. పార్టీ అండగా ఉంటుంది
  3. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మేడ్చల్, మే 21(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) కేంద్ర కార్యాలయంలో గురువారం ఆ పార్టీ చెంగిచెర్ల 12వ డివిజన్ అధ్యక్షుడు కోరే శరత్ బాబు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువ త టీఆర్పీ భారీగా చేరారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడు తూ తెలంగాణ సమాజంలో మార్పు తీసుకురాగలిగే తిరుగులేని శక్తి ఒక్క యువతకే ఉందన్నారు.

యువశక్తి తలుచుకుంటే సా ధించలేనిది ఏదీ లేదని, ఇంత పెద్ద ఎత్తున యువత ముందుకు రావడం శుభపరిణామన్నారు. యువత కేవలం ఓటర్లుగానే మిగిలి పోకుండా, రేపటి తరం పాలకులుగా, నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి యువత ఉత్సాహం, వారి వినూత్న ఆలోచనలు పార్టీకి సరికొత్త ఊపును ఇస్తాయని భ రోసా ఇచ్చారు.

నిరుద్యోగ నిర్మూలన, ఉపా ధి అవకాశాల కల్పనతో పాటు యువత భవిష్యత్తుకు టీఆర్పీ ఎల్లప్పుడూ అండగా ఉం టుందని, స్థానిక ప్రజా సమస్యలపై యువత క్రియాశీలక పాత్ర పోషించి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ లింగం యాదవ్, పార్టీలో చేరిన యువత సందీప్ చందు, దినే ష్, భార్గవ్ సురేందర్, ఆనంద్ ,గణేష్ అశోక్, తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్పీలో పెద్ద సంఖ్యలో మహిళల చేరిక

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, జిల్లా అ ధ్యక్షులు పనగట్ల చక్రపాణి ఆధ్వర్యంలో వివి ధ పార్టీలకు చెందిన మహిళలు, ముఖ్య కా ర్యకర్తలు భారీ సంఖ్యలో గురువారం టీఆర్పీ పార్టీలో చేరారు. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న  మాట్లాడుతూ ఏ సమాజంలోనైనా మహిళలు మేల్కొన్నప్పుడే అనుకు న్న లక్ష్యాలు సాధించవచ్చని, మహిళా సైనికురాళ్లతోనే తెలంగాణలో రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.పేదలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న తమ పార్టీ సిద్ధాంతా లకు ఆకర్షితులై మహిళలు ఇంత పెద్ద సం ఖ్యలో తరలిరావడం కొండంత బలాన్ని ఇ స్తోందన్నారు.

రాబోయే రోజుల్లో మహిళా శక్తితోనే పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.బంధారపు నరసయ్య గౌడ్ మరియు పనగట్ల చక్రపాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు, సామాన్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా అం డగా నిలబడే ఏకైక నాయకుడు తీన్మార్ మల్లన్న అని కొనియాడారు.

ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా జిల్లా అధ్యక్షురాలు నీరుడి శాలిని, మహిళ జిల్లా ఉపా ధ్యక్షురాలు, జాలిగేకు సౌభాగ్య,మహిళ జిల్లా కార్యదర్శి చందం వనజ, పార్టీలో చేరిన మహిళా నాయకురాలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.