22 May, 2026 | 1:35 AM

పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

22-05-2026 12:33 AM

పార్టీ మీకు అండగా ఉంటుంది 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కేటీఆర్‌ను కలిసిన కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్ర యత్నాలను వ్యతికించాలని, హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్ ను కాపాడాలని కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధుల విన్నపాన్ని విన్న కేటీఆర్ మాట్లాడుతూ కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరాని కి అత్యంత విలువైన లంగ్స్ స్పేస్ అని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో కేబీఆర్ పార్క్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అ డ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పా ర్క్ ఉనికి, చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అండర్‌గ్రౌండ్ ప్రతిపాదికన ప్రత్యా మ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు.

ఆ ప్రణాళికలు ఇప్పటికీ ము న్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయ ని గుర్తుచేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.