స్పీకర్‌పై వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు
వెంకటాపూర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో మండల కేంద్రంలో మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
08-09-2026 | 03:23pm