వికసిత్ భారత్
- ఆ లక్ష్యాన్ని నినాదంగా చూడొద్దు
- దృఢ నిశ్చయంతో ముందుకెళ్లాలి
- పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి
- కేంద్ర మంత్రివర్గానికి ప్రధాని మోదీ పిలుపు
- సేవాతీర్థ్‌లో నాలుగున్నర గంటల పాటు సమావేశం..
- ఈ ఏడాదిలో తొలి పూర్తిస్థాయి క్యాబినెట్ భేటీ ఇదే
న్యూఢిల్లీ, మే ౨౧: ‘వికసిత్ భారత్ -2047’ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రులందరూ పనిచేయా లని ఆ లక్ష్యాన్ని ఒక నినాదంలా చూడకూడదని, దేశ పురోగతిని మార్చే దృఢ నిశ్చయంగా ముందుకెళ్లాలని ఉద్బోధించారు. న్యూఢిల్లీలోని సేవాతీర్థ్ (పీఎంవో) లో గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని కీలక భేటీ నిర్వహించారు. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశం లో ప్రధానంగా వికసిత్ భారత్ లక్ష్యాలు, దేశంపై పశ్చిమాసియా సంక్షోభం, ఉద్రిక్తత ల ప్రభావంపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. పశ్చిమాసియా సంక్షో భం, ఉద్రిక్తతలు భారత్‌పైనా ప్రభావం పౌరులపై పడకుండా చూడాలని సూచించారు. వారిపై ఆర్థికపరమైన భారం పడకుండా ఇంధనం, ఎరువులు, విమానయాన సర్వీసులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాలను సమీక్షించాలని ఆదేశిం చారు. అనంతరం తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలపై సమగ్రమైన నివేదికలను సమర్పించా యి. క్యాబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు.
తర్వాత, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తాజా ప్రధాని మోదీ పర్యటించిన ఐదు దేశాల దౌత్యపరమైన విజయా లను వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నందున కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జెనీవా పర్యటనలో ఉన్నందున మరో మంత్రి జేపీ నడ్డా సమావేశానికి హాజరుకాలేదు. సమావేశానికి కేంద్ర క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు, ఇతర సహాయ మంత్రులందరూ హాజరయ్యారు.
ఈ ఏడాదిలో పూర్తిస్థాయి మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్న తరు ణంలో ప్రభుత్వ పనితీరుపై ఈ భేటీ ఒక మధ్యంతర సమీక్ష భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.






