రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
తాడ్వాయి, మే 21 (విజయక్రాంతి): రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తాడ్వాయి ఏవో నర్సింలు తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన గురువారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో తాడువాయి మండలం 74 శాతం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని మూడో స్థానంలో ఉందని తెలిపారు.
మొత్తం మండలంలో 16,773 మంది రైతుల రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 12,465 పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా 4,348 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోకుంటే ప్రభుత్వం అందించే పథకాలకు అనర్హులు అవుతారని తెలిపారు. అందుకోసం కచ్చితంగా రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ప్రభుత్వ పథకాలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈవోలు శివ చైతన్య గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.






