22 May, 2026 | 2:39 AM

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

22-05-2026 01:36 AM

నాగిరెడ్డిపేట్ మే 21 (విజయక్రాంతి): మండల కేంద్రంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రాథమిక ప్రభుత్వ దావఖానలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, ఫారుక్, సాయగౌడ్, లక్ష్మణ్ ఠాగూర్, బోరంచ స్థాయిలు, గంపల వెంకన్న, వజ్రా నాయక్, ప్రభాకర్, సురేందర్ గౌడ్, గులాబ్ హుస్సేన్, మురళి గౌడ్, బాబు, మునిగేపల్లి సంగయ్య, నారాయణరెడ్డి, గోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.