చిట్టీల వ్యాపారిని ఉరి తీయాలి!
29-03-2025
నాగర్కర్నూల్, మార్చి 28 (విజయక్రాంతి): నిరుపేదలకు అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లలో డబ్బులు తీసుకుని, ఎగనామం పెట్టిన చిట్టీల వ్యాపారి సాయిబాబాను బహిరంగంగా ఉరితీయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయిబాబా చేతిలో మోసపోయిన బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లన్న మాట్లాడారు. సుమారు 3 వేల మంది నుంచి రూ.150 కోట్లకు పైగా సాయిబాబా మోసగించాడని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు లాలూచీపడి కేసు నీరుగార్చాని విమర్శించారు. మోసపోయిన బాధితులంతా మనోధైర్యాన్ని కోల్పోవద్దని, తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వచ్చేనెల 8లోగా దోచుకున్న డబ్బంతా సాయిబాబా తిరిగి బాధితులకు చెల్లించాలని, లేదంటే భూకంపాన్ని పుట్టిస్తానని హెచ్చరించారు.