శాంతియుత వాతావరణంలో చవితి వేడుకలు నిర్వహించాలి: కలెక్టర్
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
13-09-2026 | 04:14pm