calender_icon.png 21 November, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_52565866.webp
ధాన్యం, పత్తి కొనుగోళ్లలో విఫలం

14-11-2024

మునుగోడు/మర్రిగూడ, నవబంర్ 13: ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందిని మాజీ మంత్రి హరీవ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం దళారులపాలవుతున్నదని విమర్శించారు. బుధవారం మునుగోడు నియోజ కవర్గం మర్రిగూడెం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతోపాటు బీఆర్‌ఎస్ నేత పాల్వయి స్రవంతితో కలసి వడ్ల కోనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. గతేడాది నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఈ సంవత్సరం కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు రావడంతో ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగయింన్నారు.

article_14463761.webp
అదుపుతప్పి వాహనాల బోల్తా

13-11-2024

నల్లగొండ/వనపర్తి, నవంబర్ 12 (విజయక్రాంతి)/దేవరకొండ: రెండు వేర్వేరు ఘటనల్లో కూలీలతో వెళ్తున్న రెండు వాహనాలు బోల్తా పడటంతో 15 మంది కూలీలు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు పత్తి తీసేందుకు మంగళవారం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పొగిళ్ల గ్రామానికి ఆటోలో బయలుదేరారు. బుగ్గతండాలోని కాసరాజుపల్లి పుష్కర ఘాట్ సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా పడటంతో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో దేవరకొండ ఏరియా దవాఖానాకు తరలించారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రయాదం జరిగినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.