జిల్లా కళాకారులకు టివి, సినీ రంగాలలో అవకాశం కల్పించాలి
29-03-2025
జిల్లాలోని కళాకారులకు టి.వి., సినీ రంగాలలో అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ కల్చరల్ అకాడమీ ఓం సాయి తేజ ఆర్ట్స్ - సంయుక్త నిర్వహణలో జిల్లాలోని వివిధ రంగాల కళాకారులకు టి.వి., సినీ రచయితలకు, దర్శకులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని టి.వి. సీరియల్ దర్శకుడు నాగబాల సురేష్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.