భారతీయ కళలు ప్రధానాంశంగా శివశంభో
30-03-2025
సంగీత, సాహిత్య విలువలతో భక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శివశంభో’. అనంత ఆర్ట్స్ పతాకంపై బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి, శ్రీశైలంరెడ్డి నిర్మించారు. కృష్ణ ఇస్లావత్, కేశవర్ధిని హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నర్సింగ్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భర ణి, సుమన్, టార్జాన్, విజయ్ రం గరాజన్, చిల్లర వేణు, రామస్వా మి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేశ్‌యాదవ్, శ్రీకర్, విఘ్నేశ్, బేబీ రిషిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డీవోపీగా కారె సతీశ్‌కు మార్ పనిచేస్తుండగా.. మాటలు, పాటలు, సంగీతం దోరవేటి చెన్న య్య అందిస్తున్నారు.