Districts - Ranga Reddy

శేరిలింగంపల్లిలో టౌన్ ప్లానింగ్ కొత్త టీమ్
శేరిలింగంపల్లిలో టౌన్ ప్లానింగ్ కొత్త టీమ్

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగంపల్లి జోన్ పట్టణ ప్రణాళిక విభాగంలో విస్తృత స్థాయిలో బదిలీలు జరిగాయి. కమిషనర్ ఆదేశాలతో పలువురు ఏసీపీలు, టీపీఎస్‌లు, టీపీవోల బాధ్యతలు మారాయి. సురేందర్‌రెడ్డిని జీడిమెట్ల ఏసీపీగా, రాణిని పటాన్‌చెరు ఏసీపీగా బదిలీ చేశారు. ప్రసీద్‌కు శేరిలింగంపల్లి ఇన్‌చార్జి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు టీపీఎస్‌లు, టీపీబీవోలకు కూడా అదనపు బాధ్యతలు కేటాయించారు. పట్టణ ప్రణాళిక పనుల పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

12-09-2026 | 01:18pm