Districts - Bhadradri Kothagude

తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో రాస్తారోకో
తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో రాస్తారోకో

ములకలపల్లి,సెప్టెంబర్ 13, (విజయక్రాంతి): మండలంలోని చౌటిగూడెం పంచాయతీ కంపగూడెం గ్రామంలో గత నెల రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.మంచినీటి సమస్యపై గ్రామపంచాయతీ సెక్రెటరీకి,సర్పంచ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ ఆధ్వర్యంలో కంపగూడెం క్రాస్ రోడ్‌ వద్ద ఖాళీ బిందెలతో గ్రామస్తులు సుమారు గంటసేపు ధర్నా నిర్వహించి రాకపోకలను స్తంభింపజేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మంత్రి సీతక్క రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి ఎద్దడి రాకూడదని గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు.

13-09-2026 | 08:20pm

వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన సర్పంచ్
వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన సర్పంచ్

దమ్మపేట, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావులు వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) తో చేసిన విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుందని, మట్టి విగ్రహాలు నీటిలో వేగంగా, సహజంగా కరిగిపోతాయని తెలిపారు. మట్టి విగ్రహాలలో రసాయన రంగులు, విషపూరిత పదార్థాలు లేకపోవడం వల్ల చెరువులు, నదులలోని చేపలు, ఇతర జీవరాశులకు ప్రాణాపాయం ఉండదని అన్నారు.

13-09-2026 | 03:51pm

ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు వేళాయరా
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు వేళాయరా

కొత్తగూడెం, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అందిస్తున్న ఉపకార వేతనాలకు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా సూచించారు. 2026–27లో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్ వొకేషనల్, డిప్లొమా తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన వారు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.50 లక్షల్లోపు, గత విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అర్హతను బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు.

12-09-2026 | 06:10pm