22 May, 2026 | 2:41 AM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవయ్య కుటుంబానికి అండగా పోలీస్ శాఖ

22-05-2026 12:27 AM

జిల్లా ఎస్పీ : మహేష్ బి గితే హోం గార్డు దేవయ్య కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

సిరిసిల్ల, మే21,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోమ్ గార్డ్ దేవయ్య కుటుంబ సభ్యులకు యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అందజేశారు.దేవయ్యకు యాక్సిస్ బ్యాంక్లో సాలరీ అకౌంట్ ఉండటంతో యాక్సిడెంటల్ డెత్ పాలసీ కింద ఈ బీమా మొత్తాన్ని మంజూరు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన దేవయ్య మరణం పోలీస్ శాఖకు తీరని లోటని అన్నారు. దేవయ్య కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విధుల్లో ఉన్నప్పుడు పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డులు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి,వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రమేష్,యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం, దేవయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.