Districts - Peddapalli

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి
శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి

శాంతియుత వాతావరణం లో గణేశుడి నిమజ్జన వేడుకలను జరుపుకోవాలని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి(Peddapalli DCP Bhukya Ram Reddy) తెలిపారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలంలోనీ గణేష్ మండప నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి మాట్లాడుతూ... తొమ్మిది రోజులు నిష్ఠ నియమాలతో నిర్వహించిన గణేష్ వేడుకలకు చివరి రోజు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు.

21-09-2026 | 08:48pm

సుల్తానాబాద్ ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్‌లో 28 పతకాలు సాధించిన విద్యార్థులు
సుల్తానాబాద్ ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్‌లో 28 పతకాలు సాధించిన విద్యార్థులు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 19న నిర్వహించిన సుల్తానాబాద్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు. అండర్ –17 బాలబాలికల విభాగంలో వి.అశ్వద్ రజతం, కాంస్య పతకం, టి. సాయివిష్ణు రెండు కాంస్య పతకాలు, ఎన్. సందేష్ రజతం ఆర్. అన్వేష్ కాంస్యం, కె. యశ్వంత్ కాంస్యం, రిషివర్ధన్ బంగారు పతకం,ఎ వైశాలి , బంగారు, రెండు రజతాలు, ఒకటి కాంస్యం, ఎ. గాయత్రి ఒకటి, బంగారు, కాంస్యం, కె. శ్రీజ రజతం, బి. ఐశ్వర్య రజతం, ఆఫ్రిన్ రజతం, సుమన్ బంజారా కాంస్యం, అండర్ –14 బాలబాలికల విభాగంలో కె. శ్రీచరణ్ మూడు బంగారు పతకాలు, జి. చరిత రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం, కె వినూత్న బంగారు పతకం, వి. అవంతిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

21-09-2026 | 06:02pm

మంచిరామిలో ఉచిత వైద్య శిబిరంకు స్పందన
మంచిరామిలో ఉచిత వైద్య శిబిరంకు స్పందన

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో సోమవారం సర్పంచ్ ఉప్పు లక్ష్మి , రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తిరుపతి ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఇందులో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బీరకాయల లోకేష్ వైద్య సేవలు అందించి, అవసరమైన వారికి బీపీ, షుగర్, ఈసీజీ, పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించారు.ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, గాదే విద్యాసాగర్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

21-09-2026 | 05:38pm

గోదావరిఖనిలో వీడిని యువతి మృతి మిస్టరీ
గోదావరిఖనిలో వీడిని యువతి మృతి మిస్టరీ

గోదావరిఖని, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్యతో పథకం ప్రకారం యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్‌తో పాటు మరో నిందితుడు సింగరేణి ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్‌ను పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

20-09-2026 | 01:29pm