విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసేందుకే సైన్స్ ఫెయిర్
26-03-2025
ఖానాపూర్, (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే, సైన్స్ ఫెయిర్(Science fair), ఫుడ్ ఫెస్టివల్ ,నిర్వహిస్తున్నామని, ఖానాపూర్ మండల విద్యాధికారి ప్రేమ్ సాగర్(Khanapur Mandal Education Officer Prem Sagar) అన్నారు. మండలంలోని బీర్నంది గ్రామంలోని, జడ్పీఎస్ఎస్ పాఠశాల లో బుధవారం సైన్స్ ఫెయిర్ ,ఫుడ్ ఫెస్టివల్, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, పలువురు విద్యార్థులు డస్ట్ బిన్, పగలు రాత్రికి సంబంధించిన ప్రయోగం, తడి, పొడి, పొలాలలో నీటిని అదుపు చేసే యంత్రం, ఎయిర్ గన్ వంటి ప్రయోగాలతో పాటు ,ఇంటి వద్ద చేసుకుని వచ్చిన పదార్థాలను ప్రధర్షించడం జరిగింది.