చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
30-03-2025
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో ఎల్లారెడ్డి మండలం(Yellareddy Mandal) వెంకటాపూర్ లో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మృతులు మౌనిక(26), మైథిలి(10), అక్షర(08), వినయ్ మృతి చెందారు. మైతిలి, అక్షర, వినయ్ స్నానం చేసేందుకు చెరువులో దిగారు. చెరువులో భారీ గుంత ఉండటంతో పిల్లలు మునిగిపోయారు. పిల్లలను కాపాడేందుకు తల్లి మౌనిక చెరువులోకి దిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.