Districts - Medak

పండుగ శోభ.. కళకళలాడుతున్న వీధులు
పండుగ శోభ.. కళకళలాడుతున్న వీధులు

​చేగుంట, సెప్టెంబర్ 13:(విజయక్రాంతి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చేగుంట పట్టణ కేంద్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. స్థానిక గాంధీ చౌరస్తా, ప్రధాన రహదారి వెంట వినాయక వ్రత పూజా సామగ్రి, ఏకవింశతి పత్రాలు (పూజా ఆకులు), గరిక, తాజా బంతి, చామంతి పూలు, సీతాఫలాలు, వెలగపండ్లు, మామిడి తోరణాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత మహిళలు, చిరువ్యాపారులు రోడ్డు పక్కనే దుకాణాలు ఏర్పాటు చేయగా, చేగుంటతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా వస్తువులను కొనుగోలు చేస్తుండటంతో ప్రధాన కూడలి అంతా పండుగ సందడితో కిటకిటలాడుతోంది.

13-09-2026 | 05:41pm

మనోహరాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మేడ్చల్ రామస్వామి ఎన్నిక
మనోహరాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మేడ్చల్ రామస్వామి ఎన్నిక

మనోహరాబాద్ మండల ఎస్సీ సెల్ చైర్మన్ గా మేడ్చల్ రామస్వామి అధికారికంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆదేశాల మేరకు అధికారికంగా ప్రకటించారు. వీరితోపాటు తూప్రాన్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా సర్గల వినీత్ కుమార్ ఎన్నికయ్యారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని మనోహ రెస్టారెంట్ వద్ద వీరి ఇరువురికి అధికారికంగా నియామాక పత్రాన్ని రాష్ట్ర నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర వైస్ చైర్మన్ కొమ్ము విజయ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ తాడేపు మహేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందించారు.

12-09-2026 | 04:49pm

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

పాపన్నపేట,సెప్టెంబర్12: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏబీవీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మండల కన్వీనర్ సంతోష్ పేర్కొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ శనివారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపద్యంలో నాయకులను శనివారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి ఠాణాకు తరలించారన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేటటువంటి లక్ష్యాన్ని ఏబీవీపీ ఎంచుకొని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిందన్నారు.

12-09-2026 | 12:23pm

గ్రీన్ గణేశాతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన
గ్రీన్ గణేశాతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన

నర్సాపూర్: వినాయక చవితిని పురస్కరించుకుని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ‘గ్రీన్ గణేశా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీపై కార్యక్రమం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. రమేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పర్యావరణహిత మట్టి విగ్రహాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. రసాయనాలతో తయారయ్యే విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలనే వినియోగించాలని నిర్వాహకులు సూచించారు.కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, కోఆర్డినేటర్లు,విద్యార్థులు,పాల్గొన్నారు.

12-09-2026 | 08:40am

ఘనంగా వినాయక చవితి, హిందీ దినోత్సవ వేడుకలు
ఘనంగా వినాయక చవితి, హిందీ దినోత్సవ వేడుకలు

విష్ణు ఉన్నత పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి, హిందీ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి, హిందీ ఉపాధ్యాయులు హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించి పూజలు నిర్వహించారు. వినాయక చవితి విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు.

12-09-2026 | 12:19am