22 May, 2026 | 2:40 AM

25 ఏళ్లు.. రూ.3,500 కోట్లు!

22-05-2026 01:16 AM
  1. నో పవర్, నో వాటర్     
  2. మహేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో  తీవ్ర జాప్యం
  3. నర్మదా నదిపై పాతికేళ్ల క్రితమే పనులు ప్రారంభం
  4. ఆర్థిక సంక్షోభం, అవినీతి ఆరోపణలు, నిర్వాసితుల పోరాటంతో ఆటంకం
  5. పెరుగుతున్న నిర్మాణ వ్యయం 
  6. విద్యుత్ ఉత్పత్తి, ఇండోర్‌కు తాగునీటికి గ్రహణం

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిపై దాదాపు 400 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన మహేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (ఎంహెచ్‌ఈపీ) నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిధుల కొరత, అవినీతి ఆరోపణలు, మరి యు స్థానిక గిరిజన నిర్వాసితుల పోరాటాల కారణంగా పూర్తిగా నిలిచిపోయింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్, ఇండోర్ నగరానికి తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గడిచిన 25 ఏళ్లలో చేసిన ఖర్చు దాదాపు రూ. 3,500 కోట్లకు పైగా చేరింది. అయినా ఒక్క యూ నిట్ విద్యుత్ గానీ, చుక్క నీటిని గానీ అందించకపోవడం గమనార్హం.

ఆగుతూ.. సాగుతూ..

మహేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ పను లు1990 చివరలో మొదలయ్యాయి. నిధుల కొరత వల్ల ప్రారంభంలో మందకొడిగా సాగిన పనులు.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లభించిన ఆర్థికసాయంతో 2005 మధ్యకాలంలో వేగం పుంజుకున్నాయి. 20 10 నాటికి ప్రాజెక్టు సివిల్‌పనులకు, ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

పనులు పురోగతిలో ఉన్న సమయంలోనే పునరావాస పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2010 ప్రారం భంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పర్యవేక్షణ కమిటీ.. పునరా వాస పనుల్లో ఎలాంటి అక్రమాలూ లేవని తేల్చడంతో పనులు మళ్లీ మొదలయ్యాయి. 

2012 మేలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు

ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి 2012 మే నెలలో అనుమతులు లభించాయి. అ యితే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి, వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. అందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీ ఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ), సుప్రీంకోర్టుతో సహా వివిధ న్యాయస్థానాల్లో దీనిపై విచారణలు జరిగాయి.

ప్రాజెక్టు పురోగతికి మార్గం సుగమం చేసేలా కోర్టులు పలు సూచనలు చేసినప్పటికీ వాటిని ఆచరణాత్మకంగా అమ లు చేయడంలో సంబంధిత వర్గాలు విఫలమయ్యాయి. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి గా నిలిచిపోయింది. ప్రాజెక్ట్ పనులు భౌతికంగా చాలా వరకు పూర్తయినప్పటికీ..  వి ద్యుత్ ఉత్పత్తి, నీటి సరఫరా చేయలేకపోవడంతో ప్రజాధనం దునినియోగం అయ్యిం దన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటు చేసినా దక్కని ఫలితం

ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక నిపుణు లు, ప్రాజెక్ట్ ప్రమోటర్లతో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. ప లు మార్గాలను పరిశీలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ముంపు బాధిత కుటుంబాలకు ఏడాది క్రితమే పునరావాస పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుం చి సేకరించిన సాంకేతిక విడిభాగాలు బిగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం నెలకొ న్న స్థితి నుంచి ముందుకు సాగడానికి పరిపాలన, ఆర్థిక పరమైన నిర్ణయాలే అత్యంత ముఖ్యమైనవిగా చెబుతున్నారు. 

ఎదురుచూపుల్లో ప్రజలు

దశాబ్దం క్రితం ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎప్పుడు నెరవేరుస్తుందోనని నర్మదా నదీ తీర ప్రాంత ప్రజలు, ఇండోర్ నగరవాసులు ఎదురుచూస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి విద్యుత్, తాగునీరు అందించాలని కోరుతున్నారు.

ప్రాజెక్ట్ పూర్తయితే రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారం

మధ్యప్రదేశ్‌లో ముఖ్యంగా పీక్ సీ జన్‌లో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడుతుంది. అలాగే ఇండోర్‌లో పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి వనరులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహేశ్వర్ ప్రాజెక్టు పూర్తయితే.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభించనుంది.  ఇక్కడ ఉత్పత్తి అయ్యే 400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర గ్రిడ్‌కు ఉపయోగపడుతుంది. ఇంతటి కీలకమైన ప్రాజెక్టు నిర్మాణంలో ఆల స్యం కారణంగా వ్యయం మరింతగా పెరిగింది. రుణాలపై వడ్డీ, కాంట్రాక్టర్లు నిస్తేజంగా మారడం, పూర్తయిన నిర్మాణాల నిర్వహణ వంటివి అదనపు భారాన్ని పెంచాయి.