రామేశ్వర్‌పల్లి, అయ్యవారిపల్లిలో కాంగ్రెస్ నూతన కమిటీల ఎన్నిక
భిక్కనూర్, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. రామేశ్వర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మద్ది కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల జనరల్ సెక్రటరీగా బత్తిని రాజేందర్, రామేశ్వర్‌పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒల్లెపు శశికుమార్, బీసీ సెల్ అధ్యక్షుడిగా ధర్మస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గడ్డం లింగం, కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పైల్ల రమేష్‌రెడ్డిని నియమించారు.
13-09-2026 | 08:49pm