Districts - Sangareddy

కాసాలలో పడకేసిన పారిశుధ్యం!
కాసాలలో పడకేసిన పారిశుధ్యం!

​హత్నూర: ప్రభుత్వం స్వచ్ఛత కోసం ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యంతో పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. హత్నూర మండలంలోని కాసాల గ్రామ పంచాయతీలోపారిశుధ్య నిర్వహణఅస్తవ్యస్తంగా మారింది. పల్లె ప్రగతి, స్వచ్ఛ తెలంగాణ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లోపంతో చెత్తను బహిరంగ ప్రదేశాల్లోనే కుప్పలుగా పోస్తున్నారు. ​గ్రామ శివారులోని రహదారులు, పంట పొలాల సమీపంలో చెత్తను ఇష్టారాజ్యంగా పడేస్తుండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా(Malaria) వంటి వైరల్ జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

12-09-2026 | 08:35am

సర్కారు  బడుల్లోనే నాణ్యమైన విద్య
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి భీమ్ సింగ్ సూచించారు. స్థానిక మునిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫామ్, షూ, బెల్ట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

11-09-2026 | 07:45pm