రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి
27-03-2025
గద్వాల , మార్చి 26 (విజయక్రాంతి): ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండల పరిధిలోని కొండాపురం ,వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను స్థానిక నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించి,రైతులతో మాట్లాడి,జిల్లా కలెక్టర్ సంతోష్ , ఎస్ ఏ రహిముద్దీన్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు.