సిండికేట్ మద్యంపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
29-03-2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, పలిమల, మలహర్ ఐదు మండలాలలో మద్యం దుకాణదారులు సిండికేట్ గా మారి అక్రమ దందా కొనసాగిస్తున్నారని, వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కాటారం గ్రామానికి చెందిన రామిల్ల రాజబాబు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.