సత్ఫలితాలనిస్తున్న శుక్రవారం సభ
29-03-2025
కరీంనగర్, మార్చి 28 (విజయ క్రాంతి): మహిళలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన శుక్రవారం సభ సత్ఫలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.