మానుకోటను ముంచెత్తిన వర్షం
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. దంతాలపల్లి, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. బయ్యారం, మహబూబాబాద్, గంగారం, డోర్నకల్, కురవి, చిన్న వంగర , సీరోలు, మరిపెడ, కొత్తగూడ మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. భారీ వర్షానికి కేసముద్రం పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. ఇటీవల రోడ్ల నిర్మాణం కోసం గతంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను కుంచి వేయడంతో, వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
13-09-2026 | 08:29am