calender_icon.png 31 March, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29194333.webp
ప్రజలు మెచ్చేలా సీఎం రేవంత్ పాలన

31-03-2025

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రజలందరూ మెచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఉంటుదని పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకొని రవీంద్రభారతిలో పంచాగశ్రవణం చేశారు. ‘రాష్ట్రం ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు మంచికాలం. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా పాలన సాగిస్తారు. వర్షాలు బాగా కురుస్తాయి. రైతులు ఆనందంగా ఉంటారు. బియ్యం కొరత ఏర్పడుతుంది. సీఎం తెలివితేటలతో ధన, ధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు. సోషల్ మీడియా ప్రజలను ఇబ్బం ది పెడుతుంది. ఎర్ర రేగడి భూముల, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయి. శాంతి భద్రతల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం తెలంగాణ ప్రజ లు మాంసం, మందు ముట్టకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు’ అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

article_37273174.webp
వయ్యారాల హొయలు!

31-03-2025

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. యువతులతో పాటు వివాహి తలు వయ్యారాల ఒలకబోతలతో కనువిం దు చేశారు. హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఆదివారం ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ ఫినాలేలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెం దిన 50 మంది అతివలు తమ హోయలతో అలరించారు. టాలీవుడ్ నటి వితికా షెరు, నిర్వాహకులు కిరణ్మయి అలివేలు ఫినాలేను మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కతక్ నృత్యకారిణి సంధ్య, హ్యాండ్‌లూమ్ క్యూరెటర్ శ్రీదేవి విజయదా స్, మిస్ గెలాక్సీ ఇండియా జాష్ణవి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

article_19866725.webp
శ్రీ సీతారాముల శోభాయాత్ర పర్యావరణ హితంగా నిర్వహించాలి

31-03-2025

ముషీరాబాద్, మార్చి 30: (విజయ క్రాంతి): ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు శ్రీరామనవమి ఉత్సవ సమితి శోభా యాత్ర నిర్వహించడం అభినందనీయమని, అయితే ఆ యాత్ర ను పర్యావరణ హితంగా నిర్వహించాలని ఉత్సవ సమితికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (EPDC )బహిరంగ విజ్ఞప్తి చేసింది. అంబర్ పేట శ్రీ రామ నవ మి ఉత్సవ సమితి కన్వీనర్ డాక్టర్ గౌతమ్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉత్సవ సమితి బృందం శోభాయాత్రలో ద్విచక్ర, త్రిచక్ర, చతుర్ చక్ర వాహనాలకు అనుమతి కావాలని పోలీస్‌లను కోరిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈపీ డీసీ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య ఆదివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనాల కారణంగా యాత్ర కాలుష్యమయం కాకుండా ఉండేందుకు భక్తులు పాదయాత్ర చేసేలా సమితి చొరవ తీసుకోవాలని కోరారు. భారతీయ సంప్రదాయమే ప్రకృతి సంరక్షణ అని దానికి భిన్నం గా శ్రీరామ నవమి శోభాయాత్ర సాగడం తగదన్నారు. మహానగరంలో ట్రాఫిక్ సమ స్య రాకుండా పటిష్ట వ్యూహం రూపొందించుకోవాలని కోరుతూ యాత్ర విజయవం తం కావాలని రంగయ్య ఆకాంక్షించారు.