22 May, 2026 | 1:35 AM

నేడు ’ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమం

22-05-2026 12:00 AM

సూర్యాపేట, మే 21 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజులు ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటనలో తెలిపారు. స్థానిక రవిమహల్ ఫంక్షన్ హాల్ వేదికగా ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నరు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్, ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొత్త పథకాలపై సమగ్ర విశ్లేషణ, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సాధించిన విజయాలు, రాబోయే కొత్త పథకాలపై వివరాలను వెల్లడిస్తారన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ , విద్యా, విద్యుత్, పౌరసరఫరాల శాఖలపై సమీక్ష సమావేశంలో అధికారులు పాల్గొని విజయవంతం చేయాలనీ పేర్కొన్నారు.