16 August, 2026 | 7:55 PM

Districts - Suryapet

article_30220677.webp
పాత నేరేడుచర్ల ఘనంగా బోనాలు పండుగ వేడుకలు

నేరేడుచర్ల,ఆగస్టు 16(విజయ క్రాంతి): వనభోజనాల సందర్భంగా ఆదివారం పాత నేరేడుచర్ల గ్రామదేవతలకు ముత్యాలమ్మతల్లి,లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, దాళo బాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించి బాగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని బొడ్రాయి, ముత్యాలమ్మ, దగ్గర మొక్కలు చెల్లించి గ్రామంలోని మహిళలు దేవతలకు బోనాలు సమర్పించిన అనంతరం నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న పెద్దలు మున్సిపాలిటీ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, కొణతం ఆదిరెడ్డి కొణతం కాంతారెడ్డి,కొణతం రంగారెడ్డి, కొణతం నాగిరెడ్డి, ఎడవల్లి నర్సిరెడ్డి, కొణతం నర్సిరెడ్డి కొణతం వెంకటరెడ్డి, తాటికొండ అప్పిరెడ్డి,తాళ్ల సురేష్ రెడ్డి ,కొణతం రాంరెడ్డి,దేవులపల్లి శంకరాచారి, కొణతం వెంకటరెడ్డి టీచర్, కొణతం కృష్ణారెడ్డి, కొణతం శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ రెడ్డి, నాగిరెడ్డినేరేడుచర్ల ముత్యాలమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు

16-08-2026

article_47324690.webp
అంబేద్కర్ యువజన నూతన అధ్యక్షునిగా బొంకూరి రంజిత్

తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. అభ్యర్థులుగా బొంకూరి రంజిత్, పాల్వాయి సందీప్ ఇద్దరు పోటీ పడడంతో సమన్యాయకర్తలుగా పాల్వాయి గురువయ్య, మల్లెపాక రవీందర్, బొంకూరి జలంధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో 74 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా బొంకూరి రంజిత్ కు 53 ఓట్లు పాల్వాయి సందీప్ కు 21 ఓట్లు పడ్డాయి, 32 ఓట్ల భారీ మెజార్టీ సాధించిన బొంకూరి రంజిత్ ను న్యాయ న్యాయ నిర్నేతలుగా బొంకూరి రంజిత్ ను విజేతగా ప్రకటించారు. ఎన్నిక పట్ల బాధ్యత మరింత పెరిగిందని రంజిత్ పేర్కొన్నారు.

16-08-2026

article_59861632.webp
సేవా పథకం అవార్డు అందుకున్న హేమచందర్

తుంగతుర్తి,(విజయక్రాంతి): 80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హేమచందర్ పిళ్ళై ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. దీంతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందనాల పవర్, జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీనితో తోటి పోలీస్ సిబ్బంది, మేధావులు, కుటుంబ సభ్యులు, చైతన్య భారతి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

16-08-2026

article_36590072.webp
తండ్రి, కుమారుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్ల పంపిణీ

నూతనకల్ ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన కనకటి నగేష్ తన తండ్రి కనకటి పాపయ్య, కుమారుడు కనకటి లోహిత్ జ్ఞాపకార్థం గ్రామంలోని విద్యార్థులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాన్ని సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లను, ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు.విద్యార్థుల చదువుకు తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నగేష్ తెలిపారు.

15-08-2026

article_35376151.webp
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి

హుజూర్ నగర్, ఆగస్టు 15: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి అని హుజూర్ నగర్‌ మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు.పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు...ఆనాడు భారతదేశ స్వాతంత్ర్య కోసం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.అనంతరం పట్టణంలో 400 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. దేశభక్తిని చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ సతీష్,శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు,పలు ప్రభుత్వ ఉపాధ్యాయులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

15-08-2026