పెళ్లి కావడం లేదని ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
22-05-2026 01:30 AM
నాగిరెడ్డిపేట, మే 21 (విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బూరుగుపల్లి కృష్ణ(38) వివాహం కావడం లేదని జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం చారి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బూరుగుపల్లి కృష్ణ తనకు వివాహం జరగడం లేదని మన స్థాపానికి లోనయ్యవాడని మృతుని తల్లి బోరుపల్లి స్వరూప ఫిర్యాదుల పేర్కొన్నారు అని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వానికి తరలించినట్లు తెలిపారు.






