రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు ఆదర్శం
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి, మే 21 (విజయక్రాంతి): రాజీవ్ గాంధీ ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాయని మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, యువతకు ఆయన ఒక ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే ప్రధాన మంత్రి పీఠం అధిరోహించారని, యువత రాజకీయాలలో, ఇతర రంగాల్లో ముందుండాలని కోరుకునే వారని, దానికి అనుగుణంగానే ఓటు హక్కు వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు అవకాశలు కల్పించారని అన్నారు, దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త ఒరవడులు సృష్టించి యువతకు ఉద్యోగ అవకాశలను కల్పించడంలో ముందున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అలే మల్లికార్జున్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సందీప్,మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్,కౌన్సిలర్లు అన్వర్, షేరు, రామ్మోహన్, గణేష్, సత్యం, సిద్దిక్, వాజిద్, అంజాద్, లడ్డు, సాయిలు, జావీద్, బబ్లు,మోతిలాల్, కో-ఆప్షన్ సభ్యులు గొనె సునీత శ్రీనివాస్,మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు,చాట్ల రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






