calender_icon.png 6 February, 2026 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు

05-02-2026 12:00:00 AM

  1. 1100 మంది ప్రాణత్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం 

రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

శామీర్‌పేట్, ఫిబ్రవరి 4 ( విజయ క్రాంతి) : కేసీఆర్ ఒక్కరితో తెలంగాణ రాలేదని, 1100 మంది ప్రాణ త్యాగం వల్లనే వచ్చిందని మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ , రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలియబాద్ , మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్యతో పాటు ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు.

ఆ అమరులే తెలంగాణ జాతిపితలు కావాలి కానీ కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. పది సవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ఓటు ఎలా అడుగుతున్నారు అని ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత మండలం అయిన మూడు చింతలపల్లి ని ఎం అభివృద్ధి చేసారో చెప్పాలన్నారు. లక్ష్మపూర్ రెవెన్యూ సమస్య ఎక్కడ వేసి గొంగడిలాగే ఉందన్నారు.

స్థానిక ఎమ్యెల్యే మల్ల రెడ్డి పాలు , పువ్వులు అమ్మితే లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. అలియబాద్ , మూడు చింతలపల్లి మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు  ఒక్కో మున్సిపాలిటీ కి100 కోట్లు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలియబాద్ , మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లోని కాంజర్వేషన్ జోన్ ను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

లాక్ష్మపూర్ రెవెన్యూ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చీఫ్ వీప్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ , మున్సిపాలిటీ ల ఎన్నికల ఇంచార్జ్   హరివర్ధన్ రెడ్డి, పిసరి మైపాల్ రెడ్డి , నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అజయ్ యాదవ్ మున్సిపాలిటీ ల అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, తునికి రమేష్, అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.