calender_icon.png 5 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల కోసం యువత గర్జన

05-02-2026 01:32:16 AM

  1. బడ్జెట్ లోపల జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలి
  2. లేదూ.. సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం
  3.   50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి
  4. నిరుద్యోగులతో సీఎం చర్చలు జరపాలి
  5. మహాధర్నాలో సామాజికవేత్తలు, నిరుద్యోగ జేఏసీ నేతల డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి)/ముషీరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందని పలువురు వక్తలు ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

బుధవారం రెండు లక్షల జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ తెలంగాణ ఆధ్వర్యంలో ‘హలో నిరుద్యోగి, చలో ఇందిరాపార్కు’ కార్యక్రమం పేరిట నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించింది.  ఈ ధర్నా కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ తెలంగాణ ఉద్య మకారుడు విఠల్, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీ, తెలంగాణ ఆమ్ ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు, ప్రముఖ విద్యావేత్త అశోక్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు.

నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రనాయ క్ ఆధ్యక్షతన జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మాటతప్పిందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో అశోక్‌నగర్ చౌరస్తాలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 

35 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ వేయాలని, బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్య క్రమాలను నిర్వహించి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడే అడ్డుకుంటామని వారు హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో  నిరుద్యోగ జేఏసీ నేతలు శంకర్‌నాయక్, చైతన్య కుమార్, లక్ష్మణ్, రవినాయక్, సోమేష్ కుమార్, భారీ సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. 

31 లక్షల మంది నిరుద్యోగులు

టీజీపీఎస్సీలో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషనే చేసుకున్న వారు 31.56 లక్షల మందికిపైగా ఉన్నారు. కేవలం రెండు లక్షల ఉద్యోగాలిస్తే సరిపోదు.. నిరుద్యోగ యువతకు స్కిల్స్ నేర్పించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించాలి.  రానున్న రోజుల్లో నిరుద్యోగులు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని మెడలు వంచి దింపుతారు. డెడ్‌లైన్ పెట్టుకొని నిరుద్యోగులు పోరాటం చేయాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోపు ఉద్యమ కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఆ దిశగా పోరాటాలు చేయాలి. 

 అశోక్, రఫీ, సామాజిక వేత్తలు

ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలి

తమకు కావాల్సినవి ఎన్నికల నోటిఫికేషన్లు కావు. ఉద్యోగ నోటిఫికేషన్లు.  ఒక ఎమ్మెల్యే చనిపోతేనో...రాజీనామా చేస్తేనో ఆరు నెల్లలోపల మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు.. ఉద్యోగి రిటైర్డ్ అయి ఖాళీ ఏర్పడినప్పుడు ఉద్యోగాల ను ఎందుకు భర్తీ చేయడం లేదు.  తెలంగాణ కోసం కొలువులొస్తాయని నాడు కొట్లాడాం. గత, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలురాక ఇంటికిపోలేక నిరుద్యోగులు గోసపడుతున్నరు. ఈనెలలో రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. అశోక్‌నగర్ నుం చి శంషాబాద్‌కు నిరుద్యోగులు కవాతు నిర్వహించి తమ ఉద్యోగాలేమయ్యాని అక్కడే నిలదీయాలి.

 జాజుల శ్రీనివాస్ గౌడ్, 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

మాటమారుస్తున్న ప్రభుత్వం 

నాడు రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపల రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. రెండేళ్లయినా ఉద్యోగాల జాడలేదు. పైగా తాము చెప్పింది మొదటి ఏడాదిలో కాదని, మొదటి టర్మ్‌లో అన్నట్లుగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడడం అన్యాయం. జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలి. లేకుంటే 30 లక్షల మందితో సెక్రటేరియేట్‌ను ముట్టడిస్తాం. 

 ప్రసన్న హరికృష్ణ, సామాజికవేత్త

సీఎం, మంత్రిమండలి రాజీనామా చేయాలి

మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మీకు వీలు కాకుంటే సీఎం, మంత్రి మండలి రాజీనా మా చేయాలి.  ౨ లక్షల ఉద్యోగాలను ఏడాదిలో ఇస్తామని విస్మరించారు. పీసీసీ అధ్య క్షుడిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి నిరుద్యోగు ల వేదికలమీద ఇచ్చిన హామీలు ఏమయ్యా యి. ప్రభుత్వ ఉద్యోగాలు కాదు.. కనీసం ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను ఇవ్వడంలేదు. మిమ్మ ల్ని రాజకీయ నిరుద్యోగులను చేస్తేనే మాకు ఉద్యోగాలొస్తాయనే విషయం స్పష్టమైంది. 

 పృథ్వీ, సామాజికవేత్త

సీఎం నిరుద్యోగులతో చర్చించాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి హామీని అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చింది.  నిరుద్యోగు ల ఓట్లతో అధికారంలోకి వచ్చి రెండేళ్లునా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు.  ప్రపంచ అందాల పోటీలు నిర్వహించడానికి డబ్బులున్నాయి. కానీ, నిరుద్యోగులకిచ్చిన హామీలకు డబ్బులు లేవా? మ్యానిఫెస్టోలో లేని అంశాలను అమలు చేస్తున్న ప్రభుత్వం... అందులో పొందుపర్చిన నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయడం లేదు.  రెండేళ్లలో ఏనాడైనా నిరుద్యోగులను పిలిచి మాట్లాడా వా?, మాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాలి.  

 విఠల్, సామాజికవేత్త