calender_icon.png 5 February, 2026 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారంలో హ్యాకథాన్ల్ల పాత్ర ఎంతో కీలకం

05-02-2026 12:00:00 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం, హ్యాక్స్పేస్ క్లబ్ సహకారంతో, విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పరిశ్రమకు అనుగుణమైన అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు హ్యాక్ వార్-ఎక్స్పర్ ట్ టాక్ అండ్ మినీ హ్యాకెథాన్ అనే ఒకరోజు సాంకేతిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

కార్యక్రమం హ్యాకబిలిటీ సంస్థ స్థాపకులు సీఈఓ అయిన శశిధర్ రెడ్డి మరం నిపుణుల ఉపన్యాసంతో ప్రారంభమైంది. ఆయన తన ప్రసంగంలో హ్యాకథాన్ల ప్రాముఖ్యత, పోటీ వాతావరణంలో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలు, పరిశ్రమ అనుభవం, కెరీర్ అభివృద్ధి అవకాశాలు, ప్లేస్మెంట్లు మరియు వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారంలో హ్యాకథాన్ల పాత్ర వంటి అంశాలపై విలువైన అవగాహనను పంచుకున్నారు.

పాల్గొన్న బృందాల ప్రదర్శన ఆధారంగా మూడు బృందాలను విజేతలుగా ఎంపిక చేశారు. మొదటి బహుమతిను అనురాగ్ ఎఐసిఈఎస్ బృందం సంతోష్ రెడ్డి, కార్తికేయ గెలుచుకుంది. రెండవ బహుమతిను ఎం.ఎస్.వి కాడర్ బృందం విష్ణుప్రియ, సాధన, మాధుర సాధించింది. మూడవ బహుమతిను కోడ్ క్రాఫట్స్ బృందం స్నేహ, మాధురి అందుకుంది.

ఈ కార్యక్రమంలో మొత్తం 139 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని నిపుణుల పరస్పర చర్చ ద్వారా లాభం పొందారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎం. స్వర్ణలత, డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి  మార్గదర్శకత్వంలో విజయవంతంగా సమన్వయం చేయగా, విద్యార్థి సమన్వయ కర్తలు డి. శ్రీనివాస్, డి. నిహాల్ చురుకైన సహకారం అందించారు.