calender_icon.png 4 February, 2026 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పారదర్శకం అభివృద్ధిని చూసి ఓటు వేయండి

04-02-2026 01:55:20 AM

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య 

ఇల్లెందు, ఫిబ్రవరి 3, (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు 24 మందికి ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం బీ ఫారాలు అందజేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉందన్నారు. రెండు, మూడు మార్లు సర్వే చేసి గెలిచే అభ్యర్థులనే ఎంపికచేశామన్నారు.

ఒకరిద్దరు పోటీకి వచ్చిన వారిని సముదాయించి పోటీ నుంచి విరమింప చేశామన్నారు. బీసీలకు ప్రాధాన్యతనిచ్చామని, 24 వార్డుల్లో 16 మంది మహిళలని పోటీలో నిలిపా మన్నారు. మొత్తం వార్డుల గెలుపే లక్షయంగా పనిచేస్తామన్నారు. కలిసొచ్చే పార్టీలను అడిగిన వారు ముందుకు రాలేదన్నారు. అనంతరం బీ ఫారాలు ఇచ్చిన వారి జాబితాను వివరించారు.

1వ వార్డు  ఎర్రసంగి వెంకన్న, 2వ వార్డు  దొడ్డా కిరణ్ మిత్ర, 3వ వార్డు అజ్మీర వంశీ, 4వ వార్డు మహ్మద్ కుష్బు మునావర్, 5వ వార్డు చల్లా విజయ భారతి, 6వ వార్డు రాధ కమల్ కోరి, 7వ వార్డు గొపగాని రాజు,  8వ వార్డు  రేఖా స్వరూప, 9వ వార్డు గందె పద్మ, 10వ వార్డు మెరుగు కార్తీక్, 11వ వార్డు మొగిలి లక్ష్మీ, 12వ వార్డు రంప రమ్య, 13వ వార్డు మడుగు సాయి సుధారాణి, 14వ వార్డు నెరుడు ఉపేంద్ర,  15వ వార్డు సోనిభాయ్ కోరి,

16వ వార్డు ఉల్లంగి విజయలక్ష్మీ, 17వ వార్డు పెండల రాజు, 18వ వార్డు నరేంద్రుల క్రిష్ణకుమారి, 19వ వార్డు పత్తి స్వప్న, 20వ వార్డు మహ్మద్ జాఫర్,  21వ వార్డు నీలపు రమేష్, 22వ వార్డు అంకెపాక నవీన్, 23వ వార్డు కొండపల్లి సరిత, 24వ వార్డు సిహెచ్ శృతి లు పోటీలో ఉన్నారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియెల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు, నాయకులూ కోరం సురేందర్ పాల్గొన్నారు.