05-02-2026 12:09:21 AM
రాత్రివేళలో స్మగ్లర్ల వీరంగం
అడవిలో.. స్మగ్లర్ల దూకుడు
పట్టించుకోని అటవీ శాఖ అధికారులు
మామూళ్ల మత్తులో అటవీశాఖ అధికారులు
కామారెడ్డి/బాన్సువాడ, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతతో వృక్షాలు విలవిలలాడుతున్నాయి. స్మగ్లర్ల గొడ్డలి వేటుతో పెద్ద పెద్ద చెట్లు నేల కొరుగుతున్నాయి. రాత్రి వేళలో కలప స్మగ్లర్లు జిల్లాలో రెచ్చిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవరించడంతో ఈ తతంగం రాత్రి వేళల్లో కలప స్మగ్లర్లు దర్జాగా కొనసాగీస్తున్నారు.
స్మగ్లర్లు, అటవీశాఖ అధికారులు కుమ్మక్కు
కలప స్మగ్లర్లు, అటవీశాఖ అధికారులు కుమ్మక్కై కలప స్మగ్లింగ్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు కబ్జాలకు గురైనప్పటికీ పట్టించుకోని అధికారులు, ఇటు అటవి సంపదను కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో చెట్లను నరకడం, టాక్టర్లలో డంపు చేయడం ఈ స్మగ్లర్లకు అలవాటుగా మారిపోయింది. అటు అటవీశాఖ అధికారులు కానీ, ఇటు పోలీస్ శాఖ అధికారులు కానీ పట్టించుకున్న పాపా నా పోవడం లేదు. కల్ప తరలిపోతున్న వీరు ఆ దిశగా దృష్టి సారించలేం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్ని, బాన్సువాడ, కోనాపూర్, హనుమాజిపేట్, బడాప హడు, రుద్రూర్, ప్రాంతాల నుండి కల్ప స్మగ్లింగ్ నిత్యము జరుగుతున్నట్లు సమాచారం.
మండలంలో ఇటిక బట్టిలే టార్గెట్గా దర్జాగా దందా..
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు ఈ వ్యాపకాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కల్ప స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పేరును చెప్పుకొని సదరు నాయకుడు తనకున్న వ్యాపాకాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ ముసుగు లో జరుగుతున్న ఈ తతంగం అటవీ ప్రాంతాల్లో వృక్షాలను తెగ నరికేసే స్థాయికి వచ్చింది. అధికారులు పట్టించుకోకపోవడమా..? పోలీసు అధికారులు అటువైపుగా దృష్టి సారించక పోవడమా...? ఏదో ఏమో కానీ వీరి దందా మాత్రం దర్జాగా కొనసాగిస్తున్నారు.
వన్యప్రాణులకు ముప్పు
ఓవైపు ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో అటవీ సంపదను పెంపొందించే ప్రయత్నం చేస్తుంటే కలప స్మగ్లింగ్ జీవనాధారంగా ఎంచుకున్న కొందరు ఇష్టం వచ్చినట్లు అడవుల నరుకుతున్నారు. దీంతో అడవుల నరికివేత వన్యప్రాణులకు ముప్పుగా మారింది. ఈ క్రమంలో ఆహారం నీరు దొరకక వన్యప్రాణులు సమీప గ్రామాలలోకి వస్తూ వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జింకలు, దుప్పులు వంటి వాటిని యువత కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పుతున్నారు. కానీ వెలుగులోకి రాకుండా వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
కొరవడిన పర్యవేక్షణ
అటవీ సంపద రక్షణ పట్ల ఫారెస్ట్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫీల్ వర్క్ కు దూరంగా ఉంటూ ఎక్కువ భాగం ఆఫీస్ పనులకే పరిమితమయ్యారన్న వాదనలు లేకపోలేదు. అడవుల నరికివేత వన్యప్రాణుల వేట వంటి తదితర విషయాల్లో ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప దాడులు జరపడం లేదన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు.
తమ దృష్టికి రాలేదు
కామారెడ్డి జిల్లాలో కలప స్మగ్లర్లు చెట్లను నరికి రాత్రి వేళలో కలప తరలి వెళ్తుందని విజయక్రాంతి ప్రతినిధి వివరణ కూడా తమ దృష్టికి రాలేదని పరిశీలిస్తామని తెలిపారు. తమ దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు.
నికిత, జిల్లా అటవీ శాఖ అధికారిని, కామారెడ్డి