calender_icon.png 5 February, 2026 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని యువత వినతి

05-02-2026 12:00:00 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులు గత 17 సంవత్సరాలుగా పూర్తి కాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ బుధవారం యువత అందరూ డిప్యూటీ కమిషనర్ వాణి ని కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఈ అంశంపై అవసరమైతే సంబంధిత అధికారులతో కూడ మాట్లాడి, రెండు రోజుల్లో పూర్తి వివరాలతో యువతకు సమాధానం ఇస్తానని డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా తెలియజేసినట్లు  యువకులు తెలిపారు.