మిసెస్ ఇండియా రన్నరప్ సుదీప్తా
24-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): గచ్చిబౌలిలో నివసించే హైదరాబాద్కు చెందిన సుదీప్తా దాస్.. ఈ నెల 21న జైపూర్లో నిర్వహించిన మిసెస్ ఇండియా-2025 జాతీయ పోటీల్లో రన్నరప్ టైటిల్ను సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో కథన ప్రదర్శన, టాలెంట్ రౌండ్లు, కార్పొరేట్ రౌండ్లు, ఇంటర్వ్యూలు, నేషనల్ కాస్ట్యూమ్, లెహెంగా రౌండ్ వంటి అనేక కఠిన దశలు నిర్వహించబడ్డాయి.