05-02-2026 12:51:04 AM
7, 8వ తేదీల్లో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం
జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున రాష్ట్రంలో ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీ ముఖ్యనాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ, బీజేపీ అభ్యర్థుల తరఫున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈనెల 7, 8వ తేదీల్లో తెలంగా ణలో రెండు పార్టీల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.
అయితే, పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్, రూట్ మ్యాప్, బహిరంగ సభ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 332 చోట్ల తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. వీరందరూ పార్టీ గుర్తు గ్లాస్‌పైనే పోటీ చేస్తున్నారు. మంగళవారం పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రాచారంలో జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం తాను ప్రచారం చేయనున్నట్లు వారితో పవన్ కల్యాణ్ తెలిపారు.